![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -522 లో... చందు గదిలో నుంచి బయటకు వెళ్తుంటే వల్లి ఆపుతుంది. ఏంటి నిన్ను నా భార్యగా అనుకోవట్లేదని చందు అనగానే మీ భార్య ఎప్పటికి ఉండాలనే తప్పులు చేసాను.. మీరు నన్ను భార్యగా అంగీకరించేవరకు నేను మీకు దూరంగా ఉంటానని వల్లి అంటుంది. ఇప్పుడు మీరు బయట పడుకుంటే మీ నాన్న చూసి ఏమనుకుంటాడు.. ఎంత బాధపడుతాడు. మీరు పైన పడుకోండి నేను నేలపైన పడుకుంటానని వల్లి అనగానే చందు గదిలోనే పడుకుంటాడు. వల్లి నేలపై పడుకొని వేదవతి ధీరజ్, ప్రేమ, నర్మద మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటుంది.
వాళ్ళ పెళ్లి చేసింది అత్తయ్య నా ఇంత పెద్ద నిజం దాచి అందరిని పిచ్చోళ్ళు చేశారు మీ సంగతి చెప్తానని వల్లి అనుకుంటుంది. మరొకవైపు ప్రేమ డల్ గా ఉంటుంది. ఏమైందని ధీరజ్ అడుగుతాడు. మన మాటలు వల్లి అక్క విందేమోనని భయంగా ఉందని ప్రేమ అనగానే వినలేదని అప్పుడే క్లారిటీ వచ్చింది కదా అని ధీరజ్ అంటాడు. ఏమో భయంగా ఉంది. ఆ మాటలు అని మావయ్యకి మా ఇంట్లో వాళ్ళకి చెప్తుందేమోనని భయంగా ఉందని ప్రేమ అంటుంది. ఒకవేళ అందరికి మన పెళ్లి గురించి నిజం తెలిస్తే నువ్వు కళ్యాణ్ గురించి నిజం చెప్పొద్దూ అలా అని మాటివ్వమని ప్రేమ అనగానే ధీరజ్ మాటిస్తాడు. మరొకవైపు సుకన్య బట్టలు సర్దుతుంటే అప్పుడే భాగ్యం వచ్చి ఎక్కడికి వెళ్తావే నేనొకటి చెప్తాను చెయ్.. ఆ తిరుపతి గాడికి నువ్వు అంటే ఇష్టం అంటున్నావ్ కదా వాడిని పెళ్లి చేసుకో.. వాడు జమిందర్ కొడుకు వాడికి ఆస్తులు చాలా ఉన్నాయని భాగ్యం చెప్పగానే సుకన్య సరే అంటుంది.
అప్పడే సుకన్య దగ్గరికి తిరుపతి వస్తాడు. నేను అక్కడ నుంచి వచ్చేసాను కానీ నా మనసు మొత్తం మీ మీదనే ఉందని సుకన్య అంటుంటే తిరుపతి మెలికలు తిరుగుతాడు. మరొకవైపు రామరాజుకి చందు లెక్కలు చెప్తుంటే వేదవతి వచ్చి ఎందుకు రా అన్ని చెప్తావ్ అంటుంది. నాన్నకి అన్ని విషయాలు తెలియాలని చందు అంటాడు. నాకు అసలైన వారసుడు అంటే నువ్వు అని చందుతో రామారాజు అంటాడు. అప్పుడే సాగర్, నర్మద, ప్రేమ, ధీరజ్ వస్తారు. సాగర్ కావాలనే ఫోన్ లో నా భార్య నేను ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని చెప్తాడు. అది విని ధీరజ్ కావాలనే అంటే మేం కాదా.. నా భార్యని కూడా పోలీస్ ని చేస్తానని ఇండైరెక్ట్ గా రామరాజుతో చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |